లాభాల్లో దూసుకుపోయిన ఎల్ జీ

8 Jul, 2016 15:56 IST|Sakshi

సియోల్ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ, లాభాల్లో దూసుకుపోయింది. శుక్రవారం ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాల్లో నిర్వహణ లాభాలు రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఎల్ జీ ప్రధాన వ్యాపారాలైన గృహోపకరణాలు, టెలివిజన్ సెట్లు లాభాలను పెంచడంలో కీలకపాత్ర పోషించాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద టీవీల తయారీదారుగా మార్కెట్ షేరును  సొంతం చేసుకున్న ఎల్ జీ సంస్థకు ఏప్రిల్-జూన్ లాభాలు రూ.58,500 కోట్లగా రికార్డు అయినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. 2014లో రూ.61,000 కోట్ల త్రైమాసిక లాభాలను నమోదుచేసిన తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక లాభాలని కంపెనీ వెల్లడించింది. రెవెన్యూలు కూడా 0.5 శాతానికి ఎగిసి రూ. 14 లక్షల కోట్లను (14ట్రిలియన్) నమోదుచేశాయి.

జూలై ఆఖరికి విడుదలయ్యే తుది ఫలితాల్లో మిగతా వివరాలను ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ వెల్లడించనుంది. గృహోపకరణాల వ్యాపారాల్లో ప్రీమియం ఉత్పత్తులు, ఎయిర్ కండీషనర్లకు డిమాండ్ పెరగడంతో, ఎల్ జీ నిర్వహణ లాభాలు ఎగిశాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2016 యూఈఎఫ్ఏ యూరోపియన్ ఛాంపియన్ షిప్ సాకర్ టోర్నమెంట్ లాంటి ప్రధాన క్రీడాంశాలు టీవీల క్రేజ్ ను పెంచాయని, పెద్ద సైజు సెట్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. వీక్ డిస్ ప్లే ప్యానెల్ ధరలు కూడా మార్జిన్లు పెంచడానికి దోహదం చేశాయన్నారు. 

అయితే స్మార్ట్ ఫోన్ల బిజినెస్ లు మాత్రం ఎల్ జీని నిరాశపరిచాయి. వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కూడా మొబైల్ డివైజ్ లో నిర్వహణ నష్టాలను నమోదుచేశాయి. జీ5 స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో ఎల్ జీ బాగా నిరాశపరిచాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. తీవ్ర పోటీ నేపథ్యంలో కేవలం 22 లక్షల మొబైల్ యూనిట్లను మాత్రమే ఎల్ జీ అమ్మినట్టు హెచ్ఎమ్ సీ ఇన్వెస్ట్ మెంట్ అనాలిస్ట్ గ్రేగ్ రో తెలిపారు. మొబైల్ డివైజ్ ల్లో ఎల్ జీ రూ. 9,400 కోట్ల నష్టాలను నమోదుచేసింది. 

మరిన్ని వార్తలు