గృహరుణం ఒకేసారి ఇవ్వొద్దు: ఆర్‌బీఐ

4 Sep, 2013 06:08 IST|Sakshi
గృహరుణం ఒకేసారి ఇవ్వొద్దు: ఆర్‌బీఐ
ముంబై: మంజూరైన గృహరుణాలను మొత్తం అంతా ఒకేసారిగా కాకుండా దశలవారీగా అందించాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. ముఖ్యంగా బ్యాంకులు కొత్త పథకాల పేరుతో బిల్డర్లు, రియల్టీ సంస్థలతో కలిసి రుణ మొత్తాన్ని ఏక మొత్తంగా మంజూరు చేస్తున్నాయని, దీని వలన ఏవైనా కారణాల వలన ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతే ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 
 
 వీరి ప్రయోజనాలను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇలా ఏక మొత్తంలో రుణాలను మంజూరు విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని, అందుకే నిర్మాణంలో ఉన్న, పూర్తికాని, కొత్తగా మొదలు పెడుతున్న ప్రాజెక్టుల విషయంలో దశలవారీగానే రుణాలను మంజూ రు చేయాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇంటి నిర్మాణం పూర్తి కాకపోవడం వలన మీ తరఫున బిల్డర్లు చెల్లించే ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే దాని వలన వ్యక్తిగత సిబిల్ క్రెడిట్ స్కోరింగ్ దెబ్బతింటోందని ఆర్‌బీఐ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
మరిన్ని వార్తలు