'నా వల్లే అద్వానీ బయటపడ్డారు'

23 Dec, 2015 09:07 IST|Sakshi
'నా వల్లే అద్వానీ బయటపడ్డారు'

న్యూఢిల్లీ: హవాలా కేసు నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు తన వల్లే బయటపడ్డారని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ అన్నారు. కేజ్రీవాల్ పై పరువునష్టం దావా కేసులో అరుణ్ జైట్లీని తాను ప్రాసిక్యూట్ చేయనున్నానని తెలిపారు. 'హవాలా కేసులో అద్వానీ తరపున రాంజెఠ్మలానీ వాదించాడు. కానీ ఇప్పుడు అరుణ్ జైట్లీని నేను ప్రాసిక్యూట్ చేయనున్నాను. ఇది మీరు తెలుసుకోవాలి' అని జెఠ్మలానీ అన్నారు.
 

హవాలా కేసు నుంచి అద్వానీ బయటిపడినట్టుగానే ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణల నుంచి జైట్లీ నిష్కళంకంగా బయటపడతారని ప్రధాని మోదీ పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జైట్లీని ఇష్టపడను అన్న విషయం రహస్యంగా ఉంచడానికి తాను ప్రయత్నించనని చెప్పారు.

ఈ కేసును దూరంగా ఉండాలని బీజేపీ కోరితే ప్రశ్నించగా... జైట్లీ, ఆయన కోటరీ కారణంగానే తాను బీజేపీ నుంచి బహిష్కణకు గురైయ్యానని, అయినప్పటికీ నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేశానని సమాధానమిచ్చారు. డీడీసీఏ వ్యవహారంలో విచారణ కమిటీ వేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు