సీఎంను అడ్డుకున్న గ్రామస్తులు

3 Oct, 2015 11:13 IST|Sakshi
సీఎంను అడ్డుకున్న గ్రామస్తులు

దాద్రి: యూపీతో పాటు దేశవ్యాప్తంగా చిచ్చురేపిన దాద్రి ఘటన రేపిన దుమారం  రోజురోజుకు ముదురుతోంది.  శనివారం గ్రామానికి వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు.  ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు.. తమ గ్రామంలోకి మీడియా కూడా ప్రవేశించడానికి వీల్లేదంటూ తెగేసి చెబుతున్నారు. గోమాంసం తిన్నారనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లో బిషాదా గ్రామంలో ఇఖ్లాక్ అనే వ్యక్తిని కొంతమంది గ్రామస్తులు సామూహికంగా దాడిచేసి కొట్టి చంపారు. స్థానిక బీజేపీ నేత కొడుకు ఈ ఘటనకు పురిగొల్పాడనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.

అటు విపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ముందస్తు ప్రణాళికతోనే చేసిన హత్య అని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు కూడా ఆ ఘటనపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్రం అంటోంది.


మరోవైపు  ఈ ఘటనలో హత్యకు గురైన  డానిష్ కుటుంబ సభ్యులు తమను ప్రశాంతంగా  జీవించనివ్వండంటూ   మీడియాను, ప్రజలను కోరారు.  జరిగిన ఘోరాన్ని, తాము చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే  అందరికీ  తెలిపామంటోంది.  కాగా ఈ  కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు