లోక్సభలో ముందువరుస సీట్లకు పోటీ

26 Oct, 2014 15:44 IST|Sakshi
లోక్సభలో ముందువరుస సీట్లకు పోటీ

ఢిల్లీ: లోక్సభలో సీట్ల కేటాయింపు వచ్చే నెల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా లోక్సభలో సీట్ల కేటాయింపు కొలిక్కి  రాలేదు.  శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కుర్చీల కేటాయింపు పూర్తయ్యే అవకాశముందని పార్లమెంట్  అధికారి ఒకరు తెలిపారు. ఏ పార్టీకి ఎక్కడ సీటింగ్ ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 

సోమవారం జరిగే  పార్లమెంటరీ వ్యవహారాల సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ముందువరుస సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. ప్రతిపక్షం లేనందున ముందువరుస సీట్లను తమకు కేటాయించాలని మిగతా పక్షాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ తో కలిసి సీట్లు పంచుకునేందుకు అన్నాడీఎంకే, తృణమూల్, బీజేడీ ఆసక్తి చూపకపోవడంతో కుర్చీల కేటాయింపు ఆలస్యమైంది. నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

మరిన్ని వార్తలు