ప్రేమ తాళంకప్పలను పీకేస్తాం!

18 May, 2015 11:48 IST|Sakshi
ప్రేమ తాళంకప్పలను పీకేస్తాం!

మెల్ బోర్న్: ప్రేమ తాళంకప్ప(లవ్ లాక్స్) తొలగించాలని ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. భద్రతా కారణాలతో సౌత్ గేట్ ఫుట్ బ్రిడ్జికి ఉన్న 20 వేలకు పైగా ఉన్న లవ్ లాక్స్ ను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. తాళంకప్పపై తమ పేర్లు రాసి దాన్ని బ్రిడ్జికి ఉన్న తీగకు తాళం వేసి తాళంచెవిని దూరంగా విసిరేయడం ప్రేమికులకు అలవాటుగా మారింది. తమ ప్రేమ గొప్పదని నిరూపించుకునేందుకు గత మూడేళ్లుగా ప్రేమికులు ఈవిధంగా చేస్తున్నారు.

కుప్పలు తెప్పులు వచ్చిపడిన ప్రేమ తాళంకప్పులతో బరువు పెరగడంతో బ్రిడ్జి తీగ కిందకు వంగింది. దీంతో వీటిని తోలగించాలని మెల్ బోర్న్ సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. లవ్ లాక్స్ ను తొలగించిన తర్వాత వాటిని ఎక్కడ భద్రపరచాలనే దానిపై సలహాలు ఇవ్వాలని మెల్ బోర్న్ పౌరులను మేయర్ రాబర్ట్ డొయలే కోరారు. ప్రేమ తాళంకప్పల బరువు మోయలేక 2014లో పారీస్ లోని పాంట్ డెస్ ఆర్ట్స్ బ్రిడ్జిలోని కొంతభాగం కూలిపోయింది. వంతెన కూలిపోయిన సమయంలో దానికి 7 లక్షలకు పైగా లవ్ లాక్స్ ఉన్నాయి.

మరిన్ని వార్తలు