ఒక రోజు సంపాదన వందకోట్లు!

27 Dec, 2013 11:15 IST|Sakshi
ఒక రోజు సంపాదన వందకోట్లు!

ఒక వ్యక్తి ఒక రోజలో ఎంత సంపాదించగలడు.. మా అంటే వేయి.. లేదా లక్ష.. కాదంటే పది లక్షలు.. కానీ హంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి సంపాదన వింటే దిమ్మతిరిగిపోతుంది. ఆయన ఏకంగా వంద కోట్లు సంపాదించగలడు. ఆయన చేసే దందా ఏంటో తెలుసా.. గ్యాంబ్లింగ్‌.. పైగా అంతా చట్టబద్ధంగానే చేస్తాడు. ప్రభుత్వానికి పన్ను కడుతూనే. అతను ఎవరో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

హంగ్‌కాంగ్‌కు చెందిన లూయి చీ వూ ఈ ఆటల స్వరూపాన్నే మార్చేశాడు. క్యాసినో, పేకాట వంటివాటిని నిజాయితీగా ఆడటం నేర్పించాడు. మోసం, దగా, అవినీతి అనేది లేకుండా చేశాడు. దీంతో జనాల్లో లూయి గ్యాంబ్లింగ్‌పై నమ్మకం ఏర్పడింది. అదే అతనికి కోట్లు సంపాదించి పెట్టింది. ప్రస్తుతం అతని సంపద 66 వేల 340 వేల కోట్లు.. అంటే మన ముఖేష్‌ అంబానీ ఆస్తుల కన్నా ఎక్కువ.. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ అనే సంస్థ ఇటీవల లెక్క తేల్చి చెప్పింది. ఆసియా ధనవంతుల్లో లూయి రెండో వ్యక్తిగా నిర్ధారించింది.


లూయి చీ వూకు ఇంత ఆస్తి ఉన్నా.. అతను ఎలాంటి ఆడంబరాలకు వెళ్లడు. 83 ఏళ్లు వయస్సులోనూ.. బిజినెస్‌ విస్తరణ గురించే ఆలోచిస్తాడు. ఐదుగురు కొడుకుల్లో.. పెద్ద కొడుకు ఫ్రాన్సిస్‌ లూయి గ్యాంబ్లింగ్‌ బిజినెస్‌ వ్యాపారాలు చూస్తుంటాడు. లూయి ప్రధాన ఆదాయ వనరు గేమ్స్‌ అయినా.. రియల్‌ ఎస్టేట్‌, హోటల్స్‌ కూడా ఉన్నాయి. చైనాలో క్యాసినో మార్కెట్‌లో లూయి కింగ్‌. గెలాక్సి ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. దీని ద్వారా చైనాలోని మాకావ్‌ రాష్ట్రంలో ఆరు క్యాసినో సెంటర్లను ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో అతి పెద్ద క్యాసినో సెంటర్‌ను మాకావ్‌ ఉంది. అది లూయిదే.  

మాకావ్‌ రాష్ట్ర బడ్జెట్‌కు లూయి వ్యాపారాల ద్వారా వచ్చేదే ప్రధాన ఆదాయ వనరు. బడ్జెట్‌లో 24 శాతం లూయి కట్టే ట్యాక్సే ఉంటుంది. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు ఎగ్గొట్టడాలేం ఉండవని  అతడు తరుచూ చెబుతుంటాడు. అయితే.. లూయి ప్రారంభంలో అంటే.. 1950 మొదటిసారిగా జపాన్‌ నుంచి చిన్న చిన్న వస్తువులు తెప్పించి.. చైనాలో అమ్మేవాడు. ఆ తర్వాత గ్యాంబ్లింగ్‌ వ్యాపారంలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి అతని సంపద గ్రాఫ్‌ ఆకాశ మార్గం పట్టింది.

>
మరిన్ని వార్తలు