ఢిల్లీకి వస్తున్న జాక్సన్, మన్రో !

14 Sep, 2017 22:00 IST|Sakshi

న్యూఢిల్లీ: మైకేల్‌ జాక్సన్, మార్లిన్‌ మాన్రో.. ఈ పేర్ల తెలియనివారు ఉండరు. ఒకరు తన డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగిస్తే, మరొకరు తన అందచందాలతో యువతను కట్టిపడేశారు. అయితే ఇదంతా వారు బతికున్నప్పటి సంగతి. మరి చనిపోయినవారు ఢిల్లీకి ఎలా వస్తున్నారు? అనే కదా.. మైనపు విగ్రహాల రూపంలో..! ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్‌ వ్యాక్స్‌ మ్యూజియం ఇటీవల ఢిల్లీలో ఓ బ్రాంచిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌ సెలబ్రిటీలతోపాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులతో ఈ మైనపు మ్యూజియం నిండిపోయింది.

త్వరలోనే  ఈ మ్యూజియంలోకి మైకేల్‌ జాక్సన్, మార్లిన్‌ మన్రో, జస్టిన్‌ బీబర్, లేడీ గగా, బేవాన్స్‌ నోలెస్, ఆంజెలినీ జోలీ, స్కార్లెట్‌ జాన్సన్, నికోల్‌ కిడ్‌మన్, జెన్నిఫర్‌ లోపేజ్, కేట్‌ విన్సెస్లెట్, కిమ్‌ కర్దాషియన్, డేవిడ్‌ బెక్‌హామ్, లయోనెల్‌ మెస్సీ తదితర మైనపు విగ్రహాలు కొలువుదీరనున్నాయట. ‘హాలీవుడ్‌ ప్రముఖులకు కూడా భారత్‌లో విశేష సంఖ్యలో అభిమానులున్నారు. వారందరినీ అలరించేందుకు ఢిల్లీలోని మ్యూజియాన్ని హాలీవుడ్‌ అందాలతో నింపేస్తామ’ని మ్యూజియం జనరల్‌ మేనేజర్, డైరెక్టర్‌ అన్షుల్‌ జైన్‌ తెలిపారు. 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు