స్కాం మొత్తానికి సూత్రధారి ముఖ్యమంత్రే: కాంగ్రెస్

6 Jul, 2015 18:47 IST|Sakshi
స్కాం మొత్తానికి సూత్రధారి ముఖ్యమంత్రే: కాంగ్రెస్

దేశం మొత్తాన్ని వరుస మరణాలతో వణికిస్తున్న 'వ్యాపమ్' స్కాంకు సూత్రధారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహానేనని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయించాలని, సీఎం చౌహాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతేనే విచారణ సవ్యంగా సాగుతుందని, అందువల్ల ఆయన వెంటనే రాజీనామా చేసి స్వతంత్ర విచారణ వేయాలని ఆయన అన్నారు.

మధ్యప్రదేశ్ పీసీసీ కూడా సీఎం రాజీనామాకు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కూడా వ్యాపం స్కాంలో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును స్పెషల్ టాస్క్ఫోర్స్ దర్యాప్తు చేస్తోందని, కానీ తమ పార్టీకి ఈ దర్యాప్తుపై నమ్మకం లేదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఈ స్కాంతో సంబంధమున్న 43 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు