జీటీవీపై మద్రాస్ హైకోర్టు నిషేధాజ్ఞలు

18 Mar, 2014 14:32 IST|Sakshi
మహేంద్ర సింగ్ ధోని

చెన్నై: ఐపిఎల్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రమేయానికి సంబంధించి ఎటువంటి వార్తలను జీటీవీ ప్రసారం చేయకూడదని మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. దాంతో ధోనీకి కొంత ఊరట లభించింది. తనపై అసత్యప్రచారం చేశారని  ధోని మద్రాస్‌ హైకోర్టులో  పరువునష్టం దావా వేశారు.

2013 ఐపిఎల్ టోర్నమెంట్ సందర్భంగా చోటు చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో  పలువురు టాప్ క్రికెటర్లు భాగస్వాములుగా  ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలోని వాస్తవాలను వెలికితీయడానికి సుప్రీంకోర్టు  జస్టిస్ ముద్గల్ కమిటీని నియమించింది. ఆ టోర్నమెంట్లో మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ఉన్నాడు.

మరిన్ని వార్తలు