సంజయ్దత్కు గవర్నర్ ఝలక్

24 Sep, 2015 11:33 IST|Sakshi
సంజయ్దత్కు గవర్నర్ ఝలక్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఝలక్ ఇచ్చారు. సంజూబాబా పెట్టుకన్న క్షమాభిక్ష పిటిషన్ను ఆయన తిరస్కరించారు. 1993 నాటి ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఆయుధాల చట్టం కింద దోషిగా తేలిన సంజయ్ దత్.. ప్రస్తుతం పుణెలోని ఎర్రవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతడికి మిగిలిన శిక్షాకాలాన్ని మాఫీ చేయాలంటూ సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు మహారాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రెండున్నరేళ్ల క్రితం వినతి పంపారు, దాన్ని పరిశీలించిన ప్రభుత్వం.. గత వారంలో గవర్నర్కు పంపింది. కానీ పిటిషన్ను పరిశీలించిన గవర్నర్ విద్యాసాగర్ రావు.. క్షమాభిక్ష అవసరం లేదంటూ దాన్ని తిరస్కరించారు.

ఇప్పటికే సంజయ్ దత్ వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్ మీద బయటకు వస్తూ, మళ్లీ లోపలకు వెళ్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో శిక్షను మాఫీ చేయడం సరికాదన్న ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు అనుభవించిన శిక్షాకాలాన్ని లెక్కిస్తే, సంజయ్ దత్ 2016 ఫిబ్రవరిలోనే విడుదల అవ్వాల్సి ఉంది. అంటే, మరో ఐదునెలలు గడిస్తే ఎలాంటి క్షమాభిక్ష అవసరం లేకుండానే అతడు విడుదలవుతాడు.

మరిన్ని వార్తలు