ఆస్ట్రేలియాలో ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

2 Oct, 2013 13:08 IST|Sakshi

భారత జాతిపిత మహత్మా గాంధీ 144 జయంతి వేడుకలు బుధవారం ఆస్ట్రేలియా దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మహత్ముని జన్మదినాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా రాజధాని కెన్బెర్రలోని భారత రాయబారీ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రార్థనలకు రాయబార కార్యాలయ అధికారులతోపాటు సిబ్బంది హాజరయ్యారు. అలాగే న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీలో కూడా జయంతి వేడుకులు జరిగాయి.

 

ఈ సందర్బంగా యూనివర్శిటీ ప్రాంగణంలోని గ్రంధాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్బంగా స్థానికంగా మహత్మునిపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీటితోపాటు గాంధీ పీస్ సెంటర్ ఆధర్వంలో న్యూసౌత్ వేల్స్లో 35 గ్రంధాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సెంటర్ డైరెక్టర్ రాణీ డిసౌజా ఈ సందర్బంగా ప్రసంగిస్తూ. ఆస్ట్రేలియాలో గాంధీజీ అహింసా బోధనలు ప్రఖ్యాతి పొందాయని వివరించారు.

 

గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు దేశంలోని ప్రతి ఒక్కరికి చేరాలని  డిసౌజా ఆకాంక్షించారు. ఆ మహానియుని జన్మదినాన్ని పురస్కరించుకోని గాంధీజీ ప్రబోధనలు, సిద్ధాంతాలు, ఆచరణీయాలకు సంబంధించి 10 పుస్తకాలను గ్రంధాలయాలకు అందిస్తున్నట్లు డిసౌజా తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి సందర్బంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు