మహాత్మాగాంధీ ముని మనవరాలిపై విచారణ

20 Oct, 2015 17:53 IST|Sakshi
మహాత్మాగాంధీ ముని మనవరాలిపై విచారణ

జోహన్నెస్బర్గ్: ఇద్దరు వ్యాపారవేత్తలను మోసగించిన కేసులో మహాత్మాగాంధీ మునిమనవరాలు దక్షిణాఫ్రికాలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆశిష్ లతారాంగోబిన్ (45) సోమవారం డర్బన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. తను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆమె న్యాయమూర్తికి విన్నవించారు. అనంతరం 3,776 డాలర్ల పూచీకత్తుపై బెయిలుపై విడుదలయ్యారని ఈ న్యూస్ చానెల్ పోలీసులను ఉటంకిస్తూ పేర్కొంది.

డర్బన్కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి 8.30 లక్షల డాలర్లు తీసుకొని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంగోబిన్‌ను ఈ నెల 15న అరెస్టు చేశారు. తనకు ఓ కాంట్రాక్టు దక్కిందని చెబుతూ.. ఇందుకు కొంత డబ్బు అవసరమని, వారిని నమ్మించి డబ్బు తీసుకుందని పోలీసులు అభియోగాలు మోపారు.

>
మరిన్ని వార్తలు