కోకాకోలాకు వెంకటేష్ రాజీనామా, కీలక పరిణామం

28 Apr, 2017 13:00 IST|Sakshi
కోకాకోలాకు వెంకటేష్ రాజీనామా, కీలక పరిణామం

ముంబై: దేశంలో ఇటీవల ఇబ్బందుల్లో పడిన కోకాకోలా  ఇండియా యాజమాన్యంలో కీలక మార్పును  చేపట్టింది.  అట్లాంటా, యుఎస్ఎలో కొనసాగుతున్న నాయకత్వ మార్పులకు అనుగుణంగా, గ్లోబల్ పానీయాల దిగ్గజం కోకాకోలా భారతదేశంలో  కూడా నాయకత్వాన్ని మార్చింది. హిందుస్థాన్‌ కోకా కోలా  సీఈవో   టి. కృష్ణకుమార్‌ను సౌత్‌ వెస్ట్‌ ఆసియా బిజినెస్‌ హెడ్‌గా  నియమించింది.  ప్రస్తుత ప్రెసిడెంట్‌ వెంకటేష్ కిని  రాజీనామా చేయడంతోఈ ఆదేశాలు మే 1 నుంచి  అమల్లోకి వస్తాయని  కంపెనీ ప్రకటించింది.   కోకాకోలా ఇండియా  ప్రస్తుత ప్రెసిడెంట్‌ వెంకటేష్‌ కినీ  తన పదవికి రాజీనామా  చేయడంతో  ఈ పరిణామం చోటు చేసుకుంది. 

అయితే  2012 సం.రనుంచి  దాదాపు 19 సం.లపాటు  సంస్థకు సేవలందించిన వెంకటేష్ కిని  వ్యక్తిగత కారణాల రీత్యా రిజైన్‌ చేస్తున్నట్టు  ప్రకటించారు.  అనంతరం తాను తిరిగి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.  అటు కృష్ణకుమార్‌  స్థానంలో  హిందుస్థాన్‌ కోకా కోలా  బేవరేజెస్‌ సీఈవో గా  క్రిష్టినా రగ్గిరోను  ఎంపిక చేసింది.  ఆమె హెచ్‌సీసీబీకి మొదటి మహిళా సీఈవో కానున్నారు.

 కాగా  త రెండు సంవత్సరాల్లో దేశంలో కోక్ విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గడిచిన తొమ్మిది త్రైమాసికాల్లో నాలుగింటితో పాటు ప్రతికూల వాల్యూమ్ విక్రయాలు, కీ వేసవి నెలలు కూడా ఉన్నాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మార్చడంతో, ఇటీవల దాని ప్రధాన ప్రాంతానికి బయట ఉన్న పోర్ట్ఫోలియోలను కార్బొనేటేడ్ పానీయాలు విస్తరించడం పై కేంద్రీకరించింది. భారతీయ వినియోగదారుల్లో రసాలపై పెరుగుతున్న ప్రజాదరణను క్యాష్‌ చేసుకునేందుకు  2017 లో దేశంలో  పళ్లరసాలను  ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు