క్వీన్ ఎలిజబెత్ ను కలిసిన మలాలా!

18 Oct, 2013 20:52 IST|Sakshi
క్వీన్ ఎలిజబెత్ ను కలిసిన మలాలా!
తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ శుక్రవారం బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను బంకింగ్ హమ్ ప్యాలెస్ లో కలిశారు. ఇటీవల తాను రాసిన ఐ యామ్ మలాలా అనే పుస్తకాన్ని క్వీన్ ఎలిజబెత్ కు అందించారు. 
 
కామన్ వెల్త్ యూత్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు రావడం తనకు లభించిన గొప్ప గౌరవం అని ఎలిజబెత్ కు మలాలా తెలిపింది. విద్యనభ్యసించడానికి ఎదురైన ఇబ్బందులను ఎలిజబెత్ దృష్టికి తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరికి విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మలాలా అభిప్రాయం పడినట్టు తెలిసింది. 
 
మరిన్ని వార్తలు