'గల్లంతైన విమానం' శాటిలైట్ సమాచారం విడుదల

27 May, 2014 12:33 IST|Sakshi
'గల్లంతైన విమానం' శాటిలైట్ సమాచారం విడుదల

బీజింగ్కు బయలుదేరిన కొద్ది గంటలకే అదృశ్యమైన ఎమ్హెచ్ 370 మలేషియా విమానం ఆచూకీ సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని మలేషియా ప్రభుత్వం మంగళవారం కౌలాలంపూర్లో విడుదలు చేసింది. విమానం పయనించిన మార్గానికి సంబంధించిన శాటిలైట్  చిత్రాలను విడుదల చేయాలని అదృశ్యమైన విమానంలోని ప్రయాణికుల బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో మలేషియా పౌరవిమానయా శాఖ, బ్రిటన్కు చెందిన శాటిలైట్ సంస్థ ఇన్మ్రసాట్ సంస్థలు సంయుక్తంగా మంగళవారం ఇక్కడ విడుదల చేశారు.

2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఫలితమేమీ కనిపించలేదు.

దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో రగలిపోతున్నారు. అదృశ్యమైన విమానం పయనించిన మార్గానికి సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని విడుదల చేయాలని వారు మలేషియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్కు చెందిన శాటిలైట్ సంస్థ ఇన్మ్రసాట్ సంస్థను మలేషియా ప్రభుత్వం సంప్రదించింది. దాంతో శాటిలైట్ సమాచారాన్ని మంగళవారం విడుదల చేశారు.

మరిన్ని వార్తలు