పీఏసీ తదుపరి చైర్మన్‌గా ఖర్గే

16 Mar, 2017 14:46 IST|Sakshi
పీఏసీ తదుపరి చైర్మన్‌గా ఖర్గే

న్యూఢిల్లీ: ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) తదుపరి చైర్మన్‌గా లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే నియామకానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌కే చెందిన ప్రస్తుత చైర్మన్‌ కేవీ థామస్‌ మూడో విడత పదవీకాలం ఏప్రిల్‌ 30తో ముగియనుంది. ఖర్గేను పీఏసీ చైర్మన్‌గా నియమించాలని సిఫార్సు చేస్తూ కాంగ్రెస్‌ నాయకత్వం మంగళవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

దళిత నాయకుడైన ఖర్గే గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. యూపీఏ హయాంలో రైల్వే, కార్మిఖ శాఖలు నిర్వహించారు. పీఏసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినా లోక్‌సభలో కాంగ్రెస్‌ నేతగా ఆయన కొనసాగుతారని సమాచారం.

>
మరిన్ని వార్తలు