‘నమస్తే.. నేను పీఎం మోదీ సెక్రటరీని’

6 Sep, 2017 19:55 IST|Sakshi
‘నమస్తే.. నేను పీఎం మోదీ సెక్రటరీని’
సాక్షి, గుర్‌గావ్‌(హరియాణ) : ‘‘నమస్తే.. నా పేరు అతుల్‌ కల్సి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రిన్సిపల్‌ సెక్రటరీని’’ అంటూ ఏకంగా పోలీస్‌ కమిషనర్‌కే టోకరా వేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడో ఘనుడు! 
 
అతుల్‌ కల్సి అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం గుర్‌గావ్‌ డివిజినల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆఫీసుకు వచ్చాడు. తాను పీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీనంటూ కమిషనర్‌ డి.సురేష్‌కు పరిచయం చేసుకున్నాడు. అతని వైఖరిపై అనుమానం వచ్చిన అధికారులు.. ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. ‘అసలు అతుల్‌ కల్సి అటువంటి వారెవరూ ఆ హోదాలో పనిచేయడంలేద’ని సమాధానం వచ్చింది. 
 
దీంతో అతుల్‌ కల్సిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు.. భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడని, గుర్‌గావ్‌లో ఓటర్‌ గుర్తింపు కార్డు కూడా పొందాడని పోలీసులు తెలిపారు. మోసం నేరం కింద అతడిని బుధవారం అతడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా