కూతుళ్లపై కన్న తండ్రి అఘాయిత్యం

15 May, 2014 08:54 IST|Sakshi
కూతుళ్లపై కన్న తండ్రి అఘాయిత్యం

ఓ తండ్రి తన కూతుళ్లపై పలుమార్లు అత్యాచారం చేయడమేకాకుండా... ఆ దృశ్యాలను వీడియో తీసిన తన కంప్యూటర్లో భద్రపరుచుకున్నాడో ప్రబుద్దుడు. ఆ విషయాన్ని గమనించిన అతడి భార్య మహారాష్ట్రలోని పర్బనీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆ కేసును ఔరంగాబాద్లోని సిటీ చౌక్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు నిందితుడైన కన్నతండ్రి (46)ని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... నిందితుడు తరచుగా ఇద్దరు కూతుళ్లపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో కుమార్తెలకు రెండు సార్లు గర్భస్రావం కూడా చేయించాడు. అయితే కూతుళ్లపై అత్యాచారం దృశ్యాలను వీడియో తీసి తన నివాసంలో కంప్యూటర్లో భద్రపరిచాడు. ఆ విషయాన్ని గమనించిన అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు ప్రముఖ కంపెనీలో ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా