భార్య తల నరికి.. ఆ తలతో కోర్టుకెళ్లాడు!

21 Feb, 2017 14:48 IST|Sakshi
భార్య తల నరికి.. ఆ తలతో కోర్టుకెళ్లాడు!
అది జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లా కోర్టు. అక్కడకు ఓ వ్యక్తి వచ్చాడు. మామూలుగా అయితే ఈ విషయం పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ కాదు గానీ.. అతడి చేతిలో ఒక మహిళ తల ఉంది. సదరు మహిళ జుట్టు పట్టుకుని ఆమె తలకాయను మాత్రం అతడు తీసుకుని నేరుగా కోర్టుకు వచ్చేశాడు. అతడి పేరు భుబాన్ మర్దీ. ఆ తల స్వయానా అతడి భార్యదే!! ఆమెను అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపిన భుబాన్.. తల కూడా నరికేసి, ఆ తల తీసుకుని నేరుగా కోర్టుకు బయల్దేరి వెళ్లాడు. 
 
అయితే కోర్టు లోపలికి చేరుకునే లోపే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దారిలోనే అతడి చేతిలో ఓ తల ఉండటాన్ని చుట్టుపక్కల ఉన్నవాళ్లు చూసి పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వాళ్లు వెంటనే మర్దీని అరెస్టు చేశారు. దంపతులిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ తర్వాతే అతడు ఆమెను చంపేశాడని అధకారులు చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు