ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం

18 Mar, 2017 14:40 IST|Sakshi
ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శనివారం ప్యారిస్‌ ఓర్లీ విమానాశ్రయంలో ఓ అగంతకుడు సైనికుల నుంచి తుపాకీ లాక్కొనేందుకు ప్రయత్నించగా.. సైనికులు వెంటనే అప్రమత్తమై అతనిపై కాల్పులు జరిపారు. అగంతకుడు అక్కడికక్కడే మరణించాడు.  

ఈ ఘటన తర్వాత విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. విమానాశ్రయంలో సెక్యూరిటి ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ సైనికుల కాల్పుల్లో మరణించిన అగంతకుడు ఎవరు? ఎందుకు తుపాకీ లాక్కోవాలని ప్రయత్నించాడు? ఇందులో ఉగ్రకోణం ఉందా? వంటి విషయాలు తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా