భార్యను 35సార్లు పొడిచి.. అడ్డొచ్చిన కొడుకునూ..

21 Jun, 2017 18:03 IST|Sakshi
భార్యను 35సార్లు పొడిచి.. అడ్డొచ్చిన కొడుకునూ..

35 ఏళ్ల మహిళను ఆమె భర్త దారుణంగా పొడిచి చంపాడు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని దిల్షాద్‌ గార్డెన్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం అనుమానాలతో మహిళను ఆమె భర్త 35సార్లు పొడిచి చంపాడని, ఆమె సంఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచిందని పోలీసులు తెలిపారు. దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోవడానికి ఆమె 15 ఏళ్ల కొడుకు ప్రయత్నించడంతో.. అతడిపై కూడా ఆ వ్యక్తి దాడి చేశాడు. బాలుడి చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఓ క్యాటరింగ్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న బినోద్‌ బిష్త్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్య రేఖ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రోజూ ఆమెతో గొడవపడేవాడు. బుధవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అతను ఇదేరీతిలో భార్యతో గొడవపడ్డాడు. ఆ సమయంలో పక్క గదిలో ఇద్దరు కొడుకులు నిద్రిస్తున్నారు. ఆగ్రహావేషాలకు లోనైన బినోద్‌ ఒక్కసారిగా భార్యపై కత్తితో దాడి చేశాడు. నిద్రలోంచి మెలుకువ వచ్చిన చిన్న కొడుకు తండ్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని కూడా గాయపర్చి.. భార్యను దారుణంగా పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు