హెచ్ఐవీ సోకిన 12 మంది చిన్నారులు దత్తత!

24 Aug, 2014 18:26 IST|Sakshi
హెచ్ఐవీ సోకిన 12 మంది చిన్నారులు దత్తత!

మీరట్: మంచి పనులు చేయడానికి కావాల్సింది మాటలు కాదు.. చేతలు కావాలి. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులే మిన్నా అన్నారు. హెచ్ఐవీ సోకిన 12 మంది పిల్లల్ని దత్తత తీసుకుని మనకు చేతనైన సాయంలో భాగం కావాలని సాటి చెప్పాడు అజయ్ శర్మ. మీరట్ లోని గంగానగర్ లో ఉంటున్నఅజయ్ శర్మ హెచ్ఐవీ బారిన పడ్డ చిన్నారులకు అన్నీ తానై ఆసరాగా నిలిచాడు. ఆ చిన్నారులు తల్లి దండ్రులను ఎయిడ్స్ మహమ్మారి కాటేయడంతో వారు అజయ్ వద్దకు చేరారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు బ్రతికున్నాన్నాళ్లు వారి వద్దే ఉన్నా తరువాత ఆదరణ కరవైంది. బంధువులు కూడా ఛీదరించుకున్న సమయంలో అజయ్ వారిని అక్కున చేర్చుకుని ఆశ్రయమిచ్చాడు.

 

కొంతమంది సందర్శకులు ఆ పిల్లల ఉన్న గృహాన్ని సందర్శించినప్పుడు ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆ సందర్శకులను  వివేక్ అనే 12 ఏళ్ల చిన్నారి చెమర్చిన కళ్లతో స్వాగతం పలకడం వారిని కలిచివేసింది. వీరిలో ఉన్న చిన్నారులంతా ఏడు సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.  'నాకు 12 మంది పిల్లలు ఉన్నారు. ప్రతీ ఒక్కరూ నాకు అమూల్యమైన వారే. అత్యంత ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డ ఆ తల్లిదండ్రులకు వారిని పెంచడం నిజంగా కష్టంతో కూడుకున్న పని. ఆ క్రమంలో ఈ 12 మంది నాచెంతకు చేరడం నా అదృష్టం' అంటూ అజయ్ నవ్వుతూ ఆ సందర్శకులకు తెలిపాడు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు