జూనియర్‌ ఎన్టీఆర్‌కు కరెక్టు మొగుడు అతనే!

3 Jun, 2017 23:15 IST|Sakshi
జూనియర్‌ ఎన్టీఆర్‌కు కరెక్టు మొగుడు అతనే!

బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలుకొట్టడంలో, కలెక్షన్లతో అదరగొట్టడంలో అతనికి అతనే సాటి. అలాంటి టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌కి ఇప్పుడు కరెక్ట్‌ మొగుడు వచ్చాడట. జూనియర్‌ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన మంచు మనోజ్‌ ఈ ముక్క చెప్పాడు. వరుస విజయాలతో ఊపుమీదున్న తారక్‌కు కరెక్ట్‌ మొగుడు దొరికాడని మనోజ్‌ తెగ ఇదవుతున్నాడు.

ఇంతకీ ఆ మొగుడు ఎవరంటే.. బుజ్జీ ఎన్టీఆరే. ఇంతకు విషయమేమిటంటే.. తాజాగా మంచు మనోజ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటికి వెళ్లాడట. అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్‌ బుజ్జీ తనయుడు అభయ్‌ చల్లటి నీళ్ల గ్లాసుతో స్వాగతం పలుకడమే కాదు.. స్వయంగా తానే గ్లాస్‌ పట్టుకొని తాగించాడు కూడా. అంతే బుజ్జీ అభయ్‌ ప్రేమకు పొంగిపోయిన మనోజ్‌.. ఈ బుడ్డోడే తారక్‌కు కరెక్ట్‌ మొగడంటూ ఫొటో పెట్టి మరీ ట్వీట్‌ చేశాడు. ఈ సరదా ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు