సోనియా గాంధీపై నట్వర్ సింగ్ వ్యాఖ్యలు వాస్తవమే!

3 Aug, 2014 16:20 IST|Sakshi
సోనియా గాంధీపై నట్వర్ సింగ్ వ్యాఖ్యలు వాస్తవమే!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై  కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పునురుద్ఘాటించారు. సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అడ్డుపడ్డారన్న నట్వర్ వ్యాఖ్యలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. 2004 లో సోనియా గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి ఆసక్తి చూపినా. ఆ పదవిపై ఆమె వెనక్కు తగ్గడానికి రాహులే ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చని మణిశంకర్ తెలిపారు. సోనియా ప్రధాని అయితే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలను ఉగ్రవాదులు హతమార్చినట్టుగా ఆమెను కూడా  చంపుతారేమోనని రాహుల్ బయపడ్డారని నట్వర్ సింగ్ వాఖ్యలను మణిశంకర్ తాజాగా పునరుద్ఘాటించారు.

 

అయితే  తల్లి సంరక్షణపై కొడుకు ఉండే ఆందోళనలో భాగంగానే రాహుల్ అలా చెప్పి ఉండవచ్చన్నారు.  ప్రధాని పదవిని ఆమె తిరస్కరించడానికి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నా అవి నట్వర్ కు తెలియకపోవచ్చన్నారు.  నట్వర్ సింగ్ గాంధీ కుటుంబానికి ఎంత దగ్గరగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలోని వాస్తవాలను ఆత్మకథ రూపంలో  బయటకు తేవడం కష్టసాధ్యమన్నారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో నిజాలను వెల్లడిస్తానని నట్వర్ చెప్పినా.. అంతర్లీనంగా ఉన్న పూర్తి వాస్తవాలను ఆవిష్కరించడం మాత్రం సాధ్యపడదని మణిశంకర్ తెలిపారు.

మరిన్ని వార్తలు