ఆసక్తి రేపుతున్న 'మను' ఫస్ట్ లుక్

24 Dec, 2016 19:38 IST|Sakshi
ఆసక్తి రేపుతున్న 'మను' ఫస్ట్ లుక్

హైదరాబాద్: టాలీవుడ్  లో   బ్రేక్ కోసం అష్టకష్టాలుపడుతున్న  యువ హీరో,  సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్  తాజా చిత్రం  ఫస్ట్ లుక్  రిలీజ్ అయింది.   గౌతం హీరోగా తెరకెక్కుతున్న రాబోయే  చిత్రం 'మను'  ఫస్ట్ లుక్  విడుదల చేశారు.   మరో హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఈ మను ఫస్ట్ లుక్ ను రీట్విట్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ' మను' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ మెప్పించేందుకు కష్టపడ్డట్టేకనిపిస్తోంది.   

కాగా  'పల్లకిలో పెళ్లి కూతురు' ,'వారెవ' , ' బసంతి' సినిమాలతో తెరకు పరిచయమయ్యాడు గౌతం. నటన పరంగా మార్కులు బాగానే పడినప్పటికీ, ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర  అంతగా విజయం సాధించలేకపోయాయి..  దీంతో ఈ యంగ్ హీరో  ఈసారి ఎలాగైన  సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. గౌతం హీరోగా  సినిమాలు తీసి ఇప్పటికే చేతులు కాల్చుకున్న పలువురు నిర్మాతలకు ఈ సారైనా గుడ్ న్యూస్ అందిస్తాడా.. వేచి చూడాల్సిందే.


 

మరిన్ని వార్తలు