‘కేజ్రీవాల్ కన్నింగ్.. కళ్లు తెరవండి’

10 Mar, 2017 18:23 IST|Sakshi
‘కేజ్రీవాల్ కన్నింగ్.. కళ్లు తెరవండి’

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కట్జూ మరోసారి నోటికి పని చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డరారు. ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ మోసగాడని ధ్వజమెత్తారు. మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరేనని విమర్శించారు.

‘కేజ్రీవాల్ కపట వ్యక్తి. మోసం చేయాలన్న తలంపు తప్ప ఆయన బుర్రలో మరోటి లేదు. మోసకారి మోదీకి ఆయనకు ఎటువంటి భేదం లేదు. కేజ్రీవాల్ ను చాలా మంది ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటువంటి వారి కళ్లు తెరిపించడానికి త్వరలో సమయం వస్తుంది. నిజం బయట పడుతుంద’ని కట్జూ ట్వీట్ చేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. ముందుస్తు అంచనాలు వేసే వారికి అత్యుత్సాహం పనికిరాదన్నారు. 1948 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందుగా అంచనా వేసిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా