ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

27 Apr, 2017 09:40 IST|Sakshi

ముంబై: దేశీయస్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బుధవారం రికార్డ్‌ లాభాలతో మురిపించిన మార్కెట్లు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు,  ప్రాఫిట్‌ బుకింగ్‌ తోడు కావడంతో   ఈ రోజు  స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 32 పాయింట్లు క్షీణించి 30,100వద్ద  నిఫ్టీ 14 పాయింట్లు తగ్గి 9,337 వద్ద కొనసాగుతున్నాయి.   తద్వారా  సెన్సెక్స్‌ 30వేలకు పైన, నిఫ్టీ 9300స్థాయికి ఎగువన కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ కీలక 9350 స్థాయి వద్ద మద్దతుకోల్పోయింది. 

ప్రధానంగా బ్యాంక్‌ ఇండెక్స్‌ మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ నష్టాల్లోనూ,  ఆటో రంగంలాభాల్లోను ఉంది.  యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, భారతీ  మైనస్‌లోనూ అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, కొటక్‌ బ్యాంక్‌, జీ, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌  గ్రీన్‌లోనూ ట్రేడ్‌ అవుతున్నాయి.

మరోవైపు  ఎఫ్‌అండ్‌వో ఏప్రిల్‌ సిరీస్‌ ముగియనుండటంతో ట్రేడర్లు అప్రమత్త ధోరణికి మళ్లినట్టు మార్కెట్‌ ఎనలిస్టులు భావిస్తున్నారు.   
అటు డాలర్‌ మారకంలో  రూపీ తిరిగి రూ.64ల స్థాయికి చేరగా, బంగారంధరల్లో బలహీనత కొనసాగుతోంది.  
 

మరిన్ని వార్తలు