లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

8 Aug, 2016 10:32 IST|Sakshi
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  ఆసియా మార్కెట్ల సానుకూలం సంకేతాలతో సెన్సెక్స్ దాదాపు  వంద పాయింట్ల లాభంతో ఓపెన్ అయింది. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 28,182 దగ్గర, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 8,7122దగ్గర ట్రేడవుతున్నాయి. గత వారం చివర్లో లాభాలతో మురిపించిన దలాల్  స్ట్రీట్ ఈ వారం ఆరంభంలో పాజిటివ్ నోట్ తో  మదుపర్లను ఆకట్టుకుంటోంది. మార్కెట్ల ప్రారంభంలోనే ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ సెంచరీ సాధించింది. 138 పాయింట్లు ఎగసి 28,216కు చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 8,718ను తాకింది. తద్వారా సాంకేతికంగా అత్యంత కీలకమైన 8700ను అధిగమించి  52 వారాల గరిష్టాన్ని తాకింది. ప్రధానంగా మెటల్స్‌, రియల్టీ, ఆటో, మీడియా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.2-0.4 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు లభించిన మద్దతుతో బ్యాంక్‌ నిఫ్టీ 0.4 శాతం లాభపడింది. పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని రంగాలూ లాభాలతో ట్రేడవుతున్నాయి.  గతవారం చివర్లో వెలువడ్డ అమెరికా ఉద్యోగ గణాంకాలు ఆసియా మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. జూలైలో అంచనాలకు మించి ఉపాధి కల్పన జరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలు అందాయి. హిందాల్కో, బీపీసీఎల్‌, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్, మారుతీ లాభాల్లో ఉండగా  ఐడియా 2 శాతం  నష్టపయింది. ఈ బాటలో అంబుజా సిమెంట్‌, భారతీ, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌  కూడా ఉన్నాయి.
మరోవైపు  మంగళవారం జరగనున్నద్రవ్యపరపతి సమీక్ష   దేశీయ  సూచీలకు కీలకం  కానుంది.
 
మరిన్ని వార్తలు