వివాహిత ఆత్మహత్య

16 Sep, 2016 04:37 IST|Sakshi
వివాహిత ఆత్మహత్య

రాయగడ : జేకేపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, జగదాంబ రైస్‌మిల్ యజమాని కిల్లాన శ్రీనివాస్ భార్య కిల్లాన రాణి  ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి ఆరళ్లు, భర్త వివాహేతర సంబంధం కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఆమెకు మతిస్థిమితం లేదని శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. జేకేపూర్‌కు చెందిన కిల్లాన శ్రీనివాస్‌కు, గుమ్మడ సమీపంలోని విందుపురానికి చెందిన రాణికి 22 ఏళ్ల కిందట వివాహమైంది.
 
  వారికి సమంత, మౌని క ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె, రెండో కుమార్తె విశాఖపట్నంలో చదువుతున్నారు. శ్రీనివాస్‌కు జేకేపూర్‌లోని ఒక ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉందని, ఆమె ప్రస్తుతం గర్భవతి అని చెబుతున్నారు. దీంతో శ్రీనివాస్, రాణి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బుధవారం రాత్రి 7గంటలకు ఓంశాంతి పూజకు వెళుతున్నానని చెప్పి రాణి వెళ్లిపోయింది.
 
 సమాచారం తెలుసుకున్న పుట్టింటి  వాళ్లు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త, కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మజ్జిగౌరి మందిరం సమీపంలోని రైలు పట్టాలపై మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించారు.  10 గంటల సమయంలో మృతురాలు రాణిగా జీఆర్‌పీ పోలీసులు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆమెకు మతి స్థిమితం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు శ్రీనివాస్ తెలిపారు. జీఆర్‌పీ పోలీసులు కేసు చేశారు. ఓఐసీ గణపతి బెహరా కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు