విక్రయాల్లో పడిపోయిన మారుతి

1 Nov, 2016 13:32 IST|Sakshi
విక్రయాల్లో పడిపోయిన మారుతి
పండుగ సీజన్లో కార్ల విక్రయాలు జోరు కొనసాగుతుండగా.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మాత్రం ఈ అక్టోబర్ నెల విక్రయాల్లో స్వల్పంగా పడిపోయింది. గతేడాది 1,34,209 యూనిట్లగా ఉన్న కంపెనీ విక్రయాలు ఈ ఏడాది 1,33,793 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా విక్రయాలు మందగించినప్పటికీ, దేశీయ అమ్మకాల్లో మారుతి మెరుగైన పెరుగుదలనే నమోదుచేసింది. దేశీయంగా 2.2 శాతం అమ్మకాలు పెంచుకుని 1,23,764 యూనిట్లగా నమోదుచేసినట్టు ఎంఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2015 అక్టోబర్లో ఈ విక్రయాలు 1,21,063 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకీ ఉత్పత్తులకు డిమాండ్గా బలంగానే ఉందని కంపెనీ పేర్కొంది. సియాజ్, ఎస్ క్రాస్, ఎర్టిగా, బ్రిజా, బాలెనో రిటైల్ విక్రయాలు అత్యధికంగా నమోదైనట్టు ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్ఎస్ కాల్సి తెలిపారు. 
 
నెలవారీ కంపెనీ విక్రయాలు, పనిదినాలు,  స్టాక్ ప్లాన్ వంటి స్వల్పకాలిక కారకాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఫెస్టివ్ సీజన్లో డిమాండ్పై ఇవి ప్రతిబింబిస్తాయని వివరించారు. ఆల్టో, వాగన్ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్లు విక్రయాలు 9.8 శాతం క్షీణించి, 37,595యూనిట్లగా నమోదైనట్టు ఎంఎస్ఐ ప్రకటనలో తెలిపింది. కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాలు సిప్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో విక్రయాలు 1.8 శాతం పడిపోయినట్టు మారుతి వెల్లడించింది. వీటిలో ఎక్కువగా కాంపాక్ట్ సెడాన్ డిజైర్ విక్రయాలు పడిపోయి, 27.4 శాతం కిందకి దిగజారాయి.  అక్టోబర్ నెలలో ఈ విక్రయాలు 2,481 యూనిట్లగా నమోదయ్యాయి. కాగ, మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ 8 శాతం ఎగిసి,  6,360 యూనిట్లగా రికార్డయ్యాయి. 
 
మరిన్ని వార్తలు