గుర్‌గావ్‌లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం

4 Oct, 2015 09:49 IST|Sakshi
గుర్‌గావ్‌లో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం

గుర్‌గావ్‌: హర్యానాలోని గుర్‌గావ్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 25 ఫర్నిచర్‌, ఆటోమొబైల్‌ షాపులు దగ్ధమయ్యాయి. దాంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపే అంతా కాలి బూడిదైపోయినట్టు తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వార్తలు