గణిత సూత్రాలతో మలేషియన్ విమాన వేట!

18 Jul, 2014 09:23 IST|Sakshi
గణిత సూత్రాలతో మలేషియన్ విమాన వేట!

కాన్ బెర్రి: గత కొన్ని నెలల క్రితం ప్రమాదానికి గురై ఇప్పటి వరకూ ఆచూకీ తెలియని మలేషన్ విమానం కోసం ఆ దేశం చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే పలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విఫలమైన మలేషియా.. ఆ విమాన ఆచూకీ కోసం సరికొత్త మార్గంలో పయనించనుంది. 2011 లో ఫ్రాన్స్ కు చెందిన 447 విమాన ఆచూకీకి ఉపయోగించిన గణిత సూత్రాలనే మలేషియన్ విమాన మిస్టరీని ఛేదించేందుకు ఉపయోగించనుంది.

 

అప్పట్లో అట్లాంటా మహా సముద్రంలో కూలిపోయిన విమాన శకలాలను గుర్తించిన ఇదే ఫార్ములా తప్పకుండా మరోసారి ఉపయోగపడుతుందని మెల్ బోర్న్ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ మైఖేల్ మెక్ కార్తీ అభిప్రాయపడుతున్నాడు. ఇదే ఫార్మాలతో ముందుకెళితే ఫలితం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్న మలేషియా ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించింది.


చివరకు శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి విమాన ఆచూకీ కనుగొనడంలో విఫలమైన మలేషియా..తాజా మ్యాథ్స్ ఫార్ములాతో ఖచ్చితంగా ఆచూకీ దొరుకుతుందని భావిస్తోంది. మార్చి 8వ తేదీ అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కోసం  25 దేశాలు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ మాత్రం లభించలేదు. దాదాపు మూడు నెలల క్రితం కౌలాలంపూర్ నుంచి  227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో బీజింగ్ బయల్దేరిన మలేషియన్ విమానం అకస్మికంగా తప్పిపోయిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు