అగ్నిపర్వతంపై ఆరగింపు

3 Jun, 2015 01:22 IST|Sakshi
అగ్నిపర్వతంపై ఆరగింపు

నిప్పు లేనిదే వంట చేయలేం కదా!  కానీ స్పెయిన్‌లోని ఓ హోటల్ మాత్రం ఏకంగా అగ్నిపర్వతం మీద వంటలు చేస్తోంది. అక్కడి లాజరట్ ద్వీపంలోని ఎల్‌డియాబ్లో హోటల్ ఇలా ప్రమాదకర స్థితిలో వండుతోంది. నిద్రాణ స్థితిలో ఉన్న ఈ అగ్నిపర్వతం కొనపై గ్రిల్స్ ఏర్పాటు చేసి వాటిపై కబాబ్స్ వంటి నోరూరే రుచులు వండి పర్యాటకులకు అందిస్తోంది. భూగర్భం నుంచి వెలువడే 450 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ వంటకాలు రెడీ అవుతున్నాయి. ఆఖరి సారి ఈ అగ్నిపర్వతం 1824లో బద్దలైందట. ఇప్పట్లో పేలే అవకాశం లేదని శాస్త్రవేత్తలు కూడా తేల్చిచెప్పడంతో ఎంచక్కా వంటలు వండేస్తున్నారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు