భూ సేకరణ బిల్లును ఆమోదించకండి

2 Mar, 2017 03:04 IST|Sakshi
భూ సేకరణ బిల్లును ఆమోదించకండి

రాష్ట్రపతికి మేధాపాట్కర్‌ తదితరుల లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణ భూ సేకరణ సవరణ బిల్లు–2016 రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని ప్రముఖ పర్యావరణ వేత్త మేధా పాట్కర్‌తో సహా పలు ప్రజా, రైతు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజల మౌలిక హక్కులను కూడా హరిస్తున్న క్రూరమైన జీవో 123కి ఈ బిల్లు ప్రతిరూప మంటూ దుయ్యబట్టారు. దాన్ని ఆమోదిం చొద్దని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి బుధవారం వారు లేఖ రాశారు. జీవో 123పై ఉమ్మడి హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చిందని గుర్తు చేశారు.

మెరుగైన పరిహారంతో పాటు భూ సేకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ కేంద్రం తెచ్చిన 2013 చట్టంలోని నిబంధనలన్నింటినీ సవరణ బిల్లు–2016  తుంగలో తొక్కుతోం దని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. దీనివల్ల తెలంగాణలో లక్షలాది చిన్న, సన్నకారు రైతులకు నష్టం జరుగుతుం దని ఆందోళన వెలిబుచ్చారు. లేఖపై మేధాపాట్కర్, అరుణా రాయ్, సందీప్‌ పాండే, సుజాత సూరేపల్లి, పద్మజా షా, జీవన్‌కుమార్‌ వంటి పర్యావరణవేత్తలు, న్యాయవాదులతో పాటు నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్స్, హక్కుల సంఘం, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ప్రభా వితుల సంఘం, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

>
మరిన్ని వార్తలు