మీడియాపై మాల్యా ఫ్రస్ట్రేషన్...

27 Jan, 2017 10:18 IST|Sakshi
మీడియాపై మాల్యా ఫ్రస్ట్రేషన్...

న్యూఢిల్లీ: రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యా మరోసారి ట్విట్టర్ వేదికగా తన ఉక్రోషాన్ని వెళ్ల గక్కారు. మీడియానే  తనను దోషిగా చిత్రీకరించిందని ఆరోపించారు. ఇటీవల  ప్రభుత్వ తీవ్ర  చర్యల నేపథ్యంలో ఇబ్బందుల్లో  చిక్కుకున్న  వ్యాపారవేత్త విజయ్ మాల్యా   బాగా ఫ్రస్టేట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.   అటు సీబీఐ, ఇటు సెబీ తీవ్రంగా స్పందిండంతో మాల్యాకు  చెమటలు పడుతున్నాయి.  

తాజాగా శుక్రవారం వరుస  ట్వీట్లలో మీడియాపై దాడికి దిగారు. ఎలాంటి విచారణ లేకుండా తనను  'దోషిగా'  చిత్రిస్తున్నారని మండిపడ్డారు.  విస్తృతమైన ప్రభావంతో ఇలా చేస్తున్నాయన్నారు.   బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాననడం వాస్తవం కాదన్నారు.  అసలు  తను ఎప్పుడూ అప్పులు తీసుకోలేదంటూ ట్వీట్ చేశారు.  టీఆర్పీల కోసం వివాదాలను , గందరగోళాన్ని సృష్టించకుండా తెలివిగా, విచక్షణగా వ్యవహిరించాలన్న దేశాధ్యక్షుడి మాటలను కోట్  చేశారు. 

అలాగే సీబీఐ ఆరోపణలను కూడా మాల్యా  మరోసారి తీవ్రంగా  ఖండించారు.  ఈ నిమిషం వరకు కింగ్ ఫిషర్  ఎయిర్ లైన్స్  అప్పులపై చట్టబద్ధమైన నిర్ధారణ ఏదీలేదని చెప్పొకొచ్చారు.  విచారణ తర్వాత తన సామర్ధ్యం ఏమిటో తెలిసే అవకాశం ఉందన్నారు.  


అయితే మాల్యా  లోన్ డిఫాల్ట్ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)  తన విచారణను మరింత పెడుతోంది. ఐడీబీఐ- కింగ్ ఫిషర్  కేసులోకి  ఆర్థిక శాఖ మాజీ సీనియర్ అధికారులు , ప్రజప్రతినిధులు  అలాగే సీనియర్ రాజకీయ నాయకులను విచారించినుట్టు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.  ఈ మేరకు వేల ఈమెయిల్స్ ను లోతుగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాల్యాకు  అంత సులువుగా రుణాల కేటాయింపుపై కూపీ లాగుతున్న సంగతి తెలిసిందే.

 

In our Country I assumed that innocence prevails till proven guilty. Media have convicted me guilty without trial with widespread influence

>
మరిన్ని వార్తలు