ఐఐటీ అభ్యర్థుల కోసం 3 చానళ్లు

18 Aug, 2016 03:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఐటీ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ మూడు కొత్త టీవీ చానళ్లను ప్రారంభిస్తోంది. వీటిని భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రాల బోధనలకు ఉపయోగిస్తారు. వీటిలో ప్రసారమయ్యే సిలబస్‌ను ఢిల్లీ ఐఐటీ నిపుణులు రూపొందించారు. ప్రస్తుతం సిలబస్‌ ఆంగ్లంలో అందుబాటులో ఉండగా, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లోకి త్వరలో అనువదిస్తారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు