మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ట్యాబ్లెట్

5 Jun, 2015 00:29 IST|Sakshi
మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ట్యాబ్లెట్

ధర రూ. 8,999
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ అయిన మైక్రోమ్యాక్స్.. కొత్తగా కాన్వాస్ పీ690 పేరుతో ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్ క్వాడ్ కోర్ 1.83 గిహెడ్జ్‌ను క లిగి ఉన్న ఈ ట్యాబ్లెట్ 8 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1జీబీ ర్యామ్, 5 మెగాపిక్సెల్ కెమెరా, 4,000 ఎంఎహెచ్ బ్యాటరీతో ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. 3జీ సామర్థ్యం కలిగిన ఈ ట్యాబ్ ధర రూ. 8,999. ‘‘ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెలా 30% వృద్ధి రేటును కనబరుస్తున్నట్లు ఈ సందర్భంగా మైక్రోమ్యాక్ ్స సీఈఓ వినీత్ తనేజా చెప్పారు. కొత్తగా విడుదల చేసిన 4వ తరం ఇంటెల్ ట్యాబ్‌తో రూ.6-15 వేల వరకు ఉన్న మార్కెట్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకుం టామని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెలా ఓ కొత్త ఉత్పత్తితో మార్కెట్లోకి వస్తామన్నారు.

మరిన్ని వార్తలు