ట్రంప్ పై మైక్రోసాఫ్ట్ దావా..!

31 Jan, 2017 17:10 IST|Sakshi
ట్రంప్ పై మైక్రోసాఫ్ట్ దావా..!

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముస్లిం మతం దేశాల నుండి వలసలను పరిమితం చేయడంపై టెక్ దిగ్గజం   మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్  తీవ్రంగా స్పందిస్తోంది. ఇమ్మిగ్రేషన్ కార్వ నిర్వాహక ఆదేశాలపై కంపెనీ  ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టులో దావా వేసేందుకు రడీ అవుతోంది.    ఏడు ముస్లిందేశాల శరణార్ధులపై  ట్రంప్ తాజా  ఆదేశాలను అడ్డుకునేందుకు వాషింగ్టన్ స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం సహకారంతో  ఈ దావా వేయనున్నట్టు   మైక్రో సాఫ్ట్ ప్రతినిది పీట్ వూటెన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మరోవైపు  అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వివాదాస్పద నిర్ణయాలపై భారత ప్రభుత్వం  స్పందించింది.  ప్రపంచవ్యాప్తంగా  ప్రకంపనలు పుట్టిస్తున్న ట్రంప్ తాజా నిర్ణయాలపై  కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ 1 బీ  వీసాలపై ట్రంప్  ఆంక్షల ప్రతిపాదనలపై  ట్రంప్  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విదేశాంగ శాఖ సిద్ధమవుతోంది.  ఈమేరకు అమెరికన్ కాంగ్రెస్  సీనియర్ సభ్యులతో  చర్చలు  జరుపుతున్నట్టు సమాచారం.

కాగా ఇమ్మిగ్రేషన్  ఆంక్షలపై ఇప్పటికే టెక్  దిగ్గజాలు  తమ నిరసనను వ్యక్తం చేశాయి.  ముఖ్యంగా ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  విమర్శలు గుప్పించారు.అ మెరికా వలస దారులదేశమనీ, ట్రంప్  నిర్ణయం సరైదని కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి  తెలిసిందే.

 

మరిన్ని వార్తలు