ఎఫ్‌ఐఆర్‌లతో మా పనితీరుపై ప్రభావం: సైన్యం

21 Apr, 2017 10:38 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్, మణిపూర్‌ రాష్ట్రాల్లో ఆర్మీ ఆపరేషన్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వల్ల తమ పనితీరు ప్రభావితమవుతుందని సైన్యం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

2000–2012 మధ్య వివిధ ఎన్‌కౌంటర్లలో 1538 మంది మృతి చెందడంపై న్యాయవిచారణతో పాటు నష్టపరిహారాన్ని ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) జస్టిస్‌ ఎంబీ లోకూర్, యుయు లలిత్‌ల ధర్మాసనం విచారించింది. ఈ ఘటనలపై న్యాయవిచారణకు ఏర్పాటు చేయనున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కోసం కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వం చెరో అయిదు పేర్లను సూచించాలని ఆదేశించింది.  
 

మరిన్ని వార్తలు