పాలపుంత ఏర్పాటే భిన్నం!

21 Jan, 2014 00:59 IST|Sakshi
పాలపుంత ఏర్పాటే భిన్నం!

లండన్: విశ్వంలోని నక్షత్ర సమూహా (గెలాక్సీలు)ల్లో ప్రకాశవంతంగా ఉండే మన పాలపుంత (మిల్కీవే).. మిగతావాటికి భిన్నంగా లోపలివైపు నుంచే మెల్లమెల్లగా ఏర్పడిందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జియా-ఈఎస్‌వో ప్రాజెక్టు నుంచి సేకరించిన సమాచారం సహాయంతో.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంతరిక్ష విభాగం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ జరిగిన తర్వాత ఏర్పడిన తొలి నక్షత్రాల్లో ఎక్కువ శాతం హైడ్రోజన్, హీలియం మూలకాలు మాత్రమే ఉన్నాయని.. ఆ తర్వాతి కాలపు నక్షత్రాల్లో మెగ్నీషియం వంటి లోహ మూలకాలు ఉంటాయని పరిశోధనకు నేతృత్వం వహించిన మరియా బెర్జ్ మన్ చెప్పారు.
 
  ప్రస్తుతం పాలపుంతలోని నక్షత్రాల రసాయన సమ్మేళనాలను పరిశీలించగా... మన సూర్యుడి కక్ష్యా ప్రాంతమైన మధ్య భాగంలో ఉన్నవాటిలో లోహమూలకాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని, అంచులకు వెళ్లినకొద్దీ లోహ మూలకాల పరిమాణం పెరిగినట్లుగా గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ముందుగా ఏర్పడ్డాయని, అనంతరం అంచులవైపు నక్షత్రాలు ఏర్పడుతూ పాలపుంత విస్తరించిందని తెలిపారు. అంతేగాకుండా.. పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాలు ఏర్పడడానికి తక్కువకాలం పడుతోందని, అదే అంచులవైపు నక్షత్రాలు ఏర్పడడానికి సుదీర్ఘ కాలం పడుతోందని పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు