కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సు: మంత్రి కేటీఆర్‌

29 Nov, 2016 19:00 IST|Sakshi
కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ‘ప్రస్తుతం కేసీఆర్‌ వయస్సు 64 ఏళ్లు. భారత సమకాలీన రాజకీయాలను బట్టి చూస్తే కేసీఆర్‌ది చాలా చిన్న వయస్సు. మరో 15, 20 ఏళ్లు రాజకీయాల్లో ఉండి ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఆలోపు నేను లేదా హరీశ్‌ రిటైర్‌ కావొచ్చు. ప్రస్తుతం కేసీఆర్‌గారే మాకు బాస్‌. మరో 15, 20 ఏళ్లు ఆయన నాయకత్వంలోనే అందరం కలిసి పనిచేస్తాం. మాకు స్వతంత్రంగా ఎజెండాలు లేవు. ఆశలు లేవు. హరీశ్‌ రావుతో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అధికారం కోసం మా మధ్య పోటీ లేదు’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన సూటిగా సమాధానాలు చెప్పారు. తమ కుటుంబంలో విభేదాలు లేవని, పార్టీలో హరీశ్‌తో తనకు ఆరోగ్యకరమైన పోటీ ఉందని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం లోటేనని అంగీకరించారు. ఆ లోటును ముఖ్యమంత్రి పూడుస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.

కోదండరాం..