13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

14 Sep, 2014 01:49 IST|Sakshi
13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్లోని బదయూ ప్రాంతంలో పదమూడేళ్ల అమ్మాయిని నలుగురు దుండగులు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన జరీఫ్నగర్ ప్రాంతంలో జరిగింది. నిందితులలో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

గత రాత్రి బాధితురాలు తమ ఇంట్లో మేడ మీద నిద్రపోతుండగా, దుండగులు వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లి మొత్తం నలుగురూ ఆమెపై అత్యాచారంచేసినట్లు సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘోరానికి పాల్పడిన దుండగులను అమిత్, ముక్తియార్, భోలా పండిట్, దన్నులుగా గుర్తించామన్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమిత్, ముక్తియార్లను అరెస్టు చేశామని, మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు