బాలికపై సామూహిక అత్యాచారం చేయించిన అత్త

29 Oct, 2014 16:27 IST|Sakshi
బాలికపై సామూహిక అత్యాచారం చేయించిన అత్త

రాజస్థాన్లో ఘోరం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఆమె అత్త మూడు నెలల పాటు ముగ్గురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. దాంతో ఆమె అత్తతో పాటు.. ముగ్గురు వ్యక్తులపై ఐపీసీ, పోస్కో చట్టాల కింద మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.

అందుదేవి అనే సదరు మహిళ.. ఆ బాలికను తనకు తెలిసున్న ముగ్గురు వ్యక్తుల వద్దకు తరచు తీసుకెళ్లేదని, ఇలా మూడు నెలల పాటు ఆమెపై అత్యాచారాలు చేయించిందని మహిళా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ అనితా రాణి తెలిపారు. నిందితులను రమేష్, నరసింహరాం, రత్నారాంగా గుర్తించారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

మరిన్ని వార్తలు