తుపాకితో బెదిరించి బాలికపై గ్యాంగ్రేప్

20 Jul, 2016 13:07 IST|Sakshi

ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు తుపాకితో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన బాఘ్పట్ సమీపంలోని బదౌత్ ప్రాంతంలో జరిగింది. బాలిక తమ పొలంలోకి వెళ్లినపుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈ విషయాన్ని ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఇంతవరకు ఈ విషయంలో ఎవరినీ అరెస్టు మాత్రం చేయలేదు.
 

మరిన్ని వార్తలు