సోదరుడే కీచకుడు

23 Dec, 2014 18:15 IST|Sakshi
సోదరుడే కీచకుడు

ఫరీదాబాద్: మైనర్ బాలిక పాలిట సోదరుడే కీచకుడైన దారుణ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని శాంతనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సోదరుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి చనిపోవడంతో ఏడేళ్ల నుంచి బాధితురాలు సోదరుడితో కలిసి ఉంటోంది.

తోడబుట్టిందన్న విచక్షణ కూడా లేకుండా పలుమార్లు సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆమెను భయపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు