తీహార్ జైలును సందర్శించిన విశ్వసుందరి ఒలీవియా

1 Oct, 2013 14:02 IST|Sakshi
తీహార్ జైలును సందర్శించిన విశ్వసుందరి ఒలీవియా

విశ్వసుందరి ఒలీవియా ఫ్రాన్సెస్ కప్లో తీహార్ జైలును సందర్శించింది. జైల్లో జరుగుతున్న హరిత ఉద్యమాన్ని ఎంతగానో ప్రశంసించింది. మరొక్క ఏడాది గడిస్తే తీహార్ ఇంకెంత బాగుంటుందోనని వ్యాఖ్యానించింది. సెంట్రల్ జైలు నెం.2ను సందర్శించిన ఒలీవియా, అక్కడ రెండు గంటల పాటు గడిపింది. జైలు ఫ్యాక్టరీ, ఖైదీలు తయారుచేస్తున్న వివిధ వస్తువులు.. ఇలాంటి విశేషాలన్నింటినీ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) విమలా మెహ్రా దగ్గరుండి ఆమెకు వివరించారు.

జైలులోని బ్యాండ్ నిర్వహించిన 'ఫ్లయింగ్ సోల్స్' అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఆమె చూసింది. మహిళలు, అమ్మాయిలపైన హింసకు పాల్పడకుండా ఉంటామని ఖైదీల నుంచి ఆమె మాట తీసుకున్నారు. ఆమెతోపాటు డిజైనర్ సంజనా జాన్ కూడా తీహార్ జైలుకు వచ్చారు. ఆడ శిశువుల సంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్పై అవగాహన తదితర కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఈ అమెరికా సుందరి భారతదేశంలో పది రోజుల పాటు పర్యటిస్తోంది.

మరిన్ని వార్తలు