టాటాల రూ.17వేల కోట్ల సంపద ఆవిరి

26 Oct, 2016 15:54 IST|Sakshi
టాటాల రూ.17వేల కోట్ల సంపద ఆవిరి

సంచలనం రేపిన  సైరస్ మిస్త్రీ  ఉద్వాస వ్యవహారంతో టాటా గ్రూపులోని ఐదు లిస్టెడ్ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటైన టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి సరైస్‌ మిస్త్రీని తొలగించిన  ఈ రెండురోజుల కాలంలో మార్కెట్ విలువ పరంగా  టాటా గ్రూప్‌ దాదాపు రూ.17 వేలకోట్ల  రూపాయలను నష్టపోయింది. ఈ షాకింగ్  న్యూస్ తో  రెండు ట్రేడింగ్ సెషన్లలో టాటా కంపెనీల షేర్లు దిగ్భ్రాంతికి గురి చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిస్త్రీ తొలగింపు ఐటీ కంపెనీ భవిష్యత్తుపై మరింత ప్రభావాన్ని చూపించనుందని సిటీ గ్రూపు  వ్యాఖ్యానించింది.

ముఖ్యంగా టాటా గ్రూప్ కంపెనీలోని  గరిష్ట మార్కెట్ క్యాప్ కలిగినఐటీ దిగ్గజం టిసిఎస్ షేర్ ఈ  రెండు రోజుల్లో 1.6 శాతం నష్టపోయింది.  మార్కెట్ విలువలో రూ.7.788 కోట్ల రూపాయలు కోల్పోయింది. టాటా మోటార్స్ (డీవీఆర్ షేర్లు సహా) రూ.6,100 కోట్ల సంపద ఆవిరైపోయింది. అలాగే ఇతర కంపెనీల కూడా ఇదే బాటలో పయనించాయి. టాటా స్టీల్ రూ.1,431 కోట్లు, టైటాన్  రూ.906 కోట్లు, టాటా పవర్ రూ.607కోట్ల  భారీ నష్టాలను  మూటగట్టుకున్నాయి

అయితే మధ్యంతర బాధ్యతలను స్వీకరించిన రతన్ టాటా ఈ పరిణామాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం  టాప్ సీఈవోల    సమావేశంలో హామీ ఇచ్చారు.  దీనికి బదులుగా  వ్యాపారంపై తద్వారా  సంస్థను మార్కెట్ లీడర్స్ గా నిలపడం పై దృష్టిపెట్టాలని కోరిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు