పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరా!

18 Feb, 2017 10:53 IST|Sakshi
పీవీ సింధూ వాలీబాల్ ప్లేయరా!
హైదరాబాద్ : ఇటీవలే బీకాంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివానంటూ వ్యాఖ్యానిస్తూ అందరిన్నీ ఆశ్చర్యపరిచిన  విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జలీల్ ఖాన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే పీవీ సింధూని వాలీబాల్ ప్లేయరంటూ తనకున్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. చార్మినార్లో శుక్రవారం 5కే రన్ ప్రొగ్రామ్ కోసం వచ్చిన పీవీ సింధూని ఏఐఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వాలీబాల్ ప్లేయర్ గా అభివర్ణించారు. రన్ ప్రారంభోత్సవ ప్రసంగంలో పాల్గొన్న ముంతాజ్ ఈ రన్ను నిర్వహిస్తున్న ఆర్గనైజర్లందరికీ, స్టేజ్పై ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
 
అనంతరం పీవీ సింధూని ప్రస్తావించే సమయంలో కొంత తడబడిన ఎంఎల్ఏ,  డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెవిలో ఏదో గుసగుసలాడి, హైదరాబాద్ తరుఫున వాలీబాల్ ప్లేయర్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై ఆడిన సింధూకి తాము థ్యాంక్సూ చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఎంఎల్ఏ పొరపాటున తనను వాలీబాల్ ప్లేయర్ అనడంతో పీవీ సింధూ చిన్న నవ్వు నవ్వేసి ఊరుకున్నారు. కాగా సింధూ పేరెంట్స్ మాజీ వాలీబాల్ ప్లేయర్స్. కానీ సింధూకి బ్యాడ్మింటన్ మీద ఉన్న ఆసక్తితో ఆమె సంచనాలు సృష్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రజత పతకాన్ని కూడా సాధించారు. మన లీడర్లకు నాన్-పొలిటికల్ వ్యవహారాలపై ఏమేర నాలెడ్జ్ ఉందో ఇటీవల ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్న అంశాల వల్ల బయటపడుతున్నాయి. 
 
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా