ప్రధాని వ్యాఖ్యలపై అట్టుడికిన అసెంబ్లీ!

25 Feb, 2017 11:43 IST|Sakshi
ప్రధాని వ్యాఖ్యలపై అట్టుడికిన అసెంబ్లీ!

భువనేశ్వర్‌: ఒడిశాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. ఒడిశాను కించపరుస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. అధికార బీజేడీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు శనివారం సభలో ఆందోళనకు దిగారు. వారి ఆందోళనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

ఇటీవల ఒడిశాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టడాన్ని ప్రశంసిస్తూ.. దేశంలోని నిరుపేద జిల్లాలు ఎక్కడున్నాయని వెతికితే ఒడిశాలో కనిపిస్తాయని, ఒడిశాలోని పేదలు బీజేపీకి మద్దతునిస్తే.. ఇతర పార్టీలు కొట్టుకుపోతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అయితే, ప్రధాని మోదీ వ్యాఖ్యలను అధికార బీజేడీ, కాంగ్రెస్‌ తప్పుబట్టాయి. నిరుపేద రాష్ట్రమంటూ ఒడిశాను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, కాబట్టి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు.

మరిన్ని వార్తలు